భార్య, పాప ఫొటోలను షేర్‌ చేసిన యాంకర్ రవి.. వీడిన స‌స్పెన్స్.. వైరల్‌

యాంకర్ రవి ప్రస్తుతం వరుస షోలతో బిజీగా ఉన్నాడు. ఇంతకు ఆయనకు పెళ్లయిందా లేదా.. అనే అనుమానం ఇన్ని రోజులు చాలామందిలో ఉంది. ఆయన కూడా ఎప్పుడు అడిగినా కూడా తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. దాంతో రవికి పెళ్లి అయిందని కొందరు.. కాలేదని మరికొందరు వాదించే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికీ ఒకేసారి సమాధానం చెప్పేశాడు ర‌వి. తాను ఓ ఫ్యామిలీ పర్సన్ అంటూ తన కుటుంబాన్ని పరిచయం చేశాడు. భార్య నిత్య సక్సేనాతో పాటు మూడేళ్ల పాప‌ను కూడా పరిచయం చేశాడు రవి.

ఇప్పుడు ఈయన షేర్ చేసిన ఫోటోలు నెటింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య లాస్య ..యాంకర్ రవి పెళ్లి గురించి మాట్లాడిన మాట‌లు హాట్ టాపిక్ అయ్యాయి. దానికి తోడు లాస్యతో తెగదెంపులు కూడా ఈ వివాదానికి మరింత బలాన్నిచ్చాయి. తన కుటుంబ విషయాలు తన అనుమతి లేకుండా లాస్య బయటకి చెప్ప‌డం ఏంటి అంటూ రవి కూడా మండిపడ్డాడు.

మరొకరి పర్సనల్ విషయాలు బయటకు చెప్పడం విజ్ఞ‌త కాదంటూ రవి సీరియస్ అయ్యాడు. దాంతో అసలు రవికి పెళ్ళైందా లేదా అనే అనుమానాలు చాలామందిలో అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు తనకు తానుగా తన కుటుంబాన్ని పరిచయం చేసుకున్నాడు రవి. మొత్తానికి రవి ఫ్యామిలీ ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఉన్న‌ట్లుండి ఇప్పుడెందుకు ఆయ‌న ఫోటోలు బ‌య‌టికి తీసుకొచ్చాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

CLICK HERE!! For the aha Latest Updates