HomeTelugu Trendingబాలీవుడ్‌ సినిమాలపై రామ్‌ గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ సినిమాలపై రామ్‌ గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు

Ram Gopal Varma sensational
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా, ఏది మాట్లాడినా సంచలనమే. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసి వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా బాలీవుడ్ గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ పని అయిపోయిందని ఆయన ట్వీట్ చేశారు. ‘పుష్ప’ సినిమా ఘన విజయం సాధించినప్పటి నుంచి బాలీవుడ్ పై వర్మ సెటైర్లు వేయడం ప్రారంభమైంది. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్2’ చిత్రాలు తిరుగు లేని విజయం సాధించిన తర్వాత ఇది మరింత ఎక్కువయింది.

దక్షిణాది చిత్రాలు ఘన విజయాలను అందుకోవడం, ఉత్తరాది చిత్రాలు డీలా పడటం చూస్తుంటే… కేవలం ఓటీటీల కోసమే బాలీవుడ్ సినిమాలను తెరకెక్కించే రోజులు వచ్చేలా ఉన్నాయని వర్మ అన్నారు. బాలీవుడ్ ని దక్షిణాది సినిమాలు డామినేట్ చేస్తున్నాయనే చర్చ ఇప్పటికే పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ తరుణంలో వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచేలా ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu