HomeTelugu Trendingప్రభాస్‌ది నా క్యాస్టే.. రామ్‌ గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్‌

ప్రభాస్‌ది నా క్యాస్టే.. రామ్‌ గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్‌

4 24వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్వీట్టర్ వేదికగా వర్మ మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభాస్‌ది తన క్యాస్టే అంటూ… వాయిస్ ఓవర్ ఇస్తూ… ఓ వీడియోను విడుదల చేశారు. తనకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువన్నారు. అందుకే ప్రభాస్ ‘సాహో’ సినిమా కోసం కళ్లు వాచిపోయేలా ఎదురుచూస్తున్నా అన్నారు. ఎందుకంటే ప్రభాస్ తన క్యాస్ట్ కాబట్టి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను డైరెక్షన్‌ చేస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ అన్న సినిమాలో మరోపాటను కూడా రిలీజ్ చేస్తున్నానని పేర్కొన్నారు. ఆగష్టు 27వ తేదీ అంటే రేపు ఉదయం 9.27 నిమిషాలకు బ్రహ్మ ముహుర్తంలో పాటను విడుదల చేస్తున్నా అన్నారు. రామ్‌ గోపాల్‌ వర్మ ట్విట్టర్ ‌లో చేసిన ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అయ్యింది. ప్రభాస్ అభిమానులతో పాటు… వర్మ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu