HomeTelugu Trendingన్యాచురల్ స్టార్ నాని ఒక్కడే తెలుసు కొడాలి నాని ఎవరో నాకు తెలియదు: ఆర్జీవీ

న్యాచురల్ స్టార్ నాని ఒక్కడే తెలుసు కొడాలి నాని ఎవరో నాకు తెలియదు: ఆర్జీవీ

Ram gopal varma tweets on
టాలీవుడ్ సినీ ప్రముఖులకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ రేట్ల విషయమై మాటల యుద్ధం జరుగుతున్నా సంగతి తెలిసిందే. ఇక ఈ వివాదంలోకి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంటరయ్యి.. టాలీవుడ్ తరుపున తన ప్రశ్నలను ప్రభుత్వానికి వినిపిస్తున్నాడు. రెండు రోజుల నుంచి ఆర్జీవీ వరుసగా ఏపీ ప్రభుత్తంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వర్మ ట్వీట్లకు ఏపీ మంత్రి పేర్ని నాని సమాధానాలు చెప్పడంతో ఈ ట్వీట్లు అస్సలు ఆగడం లేదు.

ఇకపోతే తాజాగా వర్మ వేసిన ట్వీట్ మరో సంచలనంగా మారింది. ఈ గొడవలోకి కొడాలి నాని ని కూడా లాక్కొచ్చాడు. AP టికెట్ రేట్ల విషయం లో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ నాని ఒక్కడే ..వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు’ అని బాంబ్ పేల్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu