HomeTelugu Trendingమంచు బ్యానర్‌లో ఎన్టీఆర్‌ వెబ్‌ సిరిస్!

మంచు బ్యానర్‌లో ఎన్టీఆర్‌ వెబ్‌ సిరిస్!

3 18

నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ గా చేసిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయి. ఇక రామ్ గోపాల్ వర్మ తెరక్కెకించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కూడా అంతే. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు ఒక వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయాల నేపథ్యంలో నిర్మితమవుతున్న కారణంగా ‘చదరంగం’ అనే టైటిల్ ను ఖరారు చేశారట.

ఎన్టీఆర్‌ని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి, ఆయనకి అత్యంత సన్నిహితుడు మోహన్ బాబు. అందువలన ఈ వెబ్ సిరీస్‌కి కథా సహకారాన్ని మోహన్ బాబు అందించారని అంటున్నారు. రాజ్ అనంత ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తుండగా, ఎన్టీ రామారావు పాత్రలో హీరో శ్రీకాంత్ నటిస్తున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన జీ 5లో కొద్దీ రోజుల్లోనే ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుంది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu