HomeTelugu Trendingహెబ్బాపటేల్ తో రామ్‌ 'డించాక్ డించాక్'..

హెబ్బాపటేల్ తో రామ్‌ ‘డించాక్ డించాక్’..

2 14
టాలీవుడ్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రెడ్’ . ‘ఇస్మార్ట్ శంకర్’ తరవాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నివేదా పేతురాజ్,మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అప్పుడప్పుడు రామ్ తన సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. డిజిటల్‌లో ఈ సినిమా విడుదల అవుతుందన్న వార్తలపై రామ్ స్పందించి… థియేటర్లలోనే రెడ్ సినిమా చూడొచ్చని క్లారిటీ కూడా ఇచ్చాడు. తాజాగా రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని మాస్ సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ‘డించాక్ డించాక్’ అంటూ సాగే ఈ పాటలో హెబ్బాపటేల్ తో కలిసి రామ్ స్టెప్పులేశాడు. స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ‘రెడ్’ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. ఏప్రిల్‌లో విడుదల కావలసిన ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిప సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu