HomeTelugu Trendingఎలిమినేట్‌ అయిన కుమార్ సాయి.. స్టేజ్‌పై గంతులు

ఎలిమినేట్‌ అయిన కుమార్ సాయి.. స్టేజ్‌పై గంతులు

kumar sai evicted
తెలుగు బిగ్‌బాస్‌ -4 నుంచి ఈ ఆదివారం గేమ్స్‌, డాన్స్‌లతో సందడి చేయించాడు నాగార్జున. అలాగే ‘స్టార్ మా’ దేశంలోనే నెంబ‌ర్ 1 ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ అని నాగ్‌ స‌గ‌ర్వంగా వెల్ల‌డించారు. టాస్క్‌ల మధ్యలో ఒకొక్కర్ని సేవ్‌ చేశాడు. చివరికి మోనాల్‌, సాయి కుమార్‌ మిగిలిపోయారు. వారిద్దర్నీ క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి ర‌మ్మ‌న్నారు. ముందుగా లీకువీరులు చెప్పినట్లుగా.. కుమార్‌ సాయిని ఎలిమినేట్‌ చేసి మోనాల్‌ను సేవ్‌ చేశాడు. బయటకు వచ్చిన కుమార్‌ సాయి నాగార్జున‌కు క‌థ చెప్పాల‌న్న కోరిక‌కు ఆయ‌న‌ అనుమ‌తించారు. దీంతో తాను అనుకుంది సాధించాన‌ని అత‌డు స్టేజీపైనే గంతులేశాడు. త‌ర్వాత ఇంటి స‌భ్యులంద‌రినీ ఒక్కో కూర‌గాయ‌తో పోల్చాడు. త‌ర్వాత కంటెస్టెంట్స్‌ కోరిక మేర‌కు స్టేజ్‌పై కుమార్ డ్యాన్స్ చేశాడు. అదే స‌మ‌యంలో మోనాల్ క‌న్ఫెష‌న్ రూమ్‌లో నుంచి బ‌య‌టకు రావ‌డంతో అఖిల్ తెగ సంతోషించాడు. ఇక బిగ్‌బాంబ్‌ (వారం రోజుల‌పాటు వాష్‌రూమ్స్ శుభ్రం చేయాలి)ను కుమార్‌ మాస్ట‌ర్‌పై వేశాడు.

మెహ్రీన్‌ తో క్లాప్‌బోర్డు ఇంటర్య్వూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu