HomeTelugu Trendingగుండుతో రామ్‌ న్యూలుక్‌!

గుండుతో రామ్‌ న్యూలుక్‌!

6 9యంగ్‌ హీరో రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా విజయంతో మంచి ఊపు మీదున్నాడు. చాన్నాళ్ళ నుండి హిట్ లేక అల్లల్లాడిన ఆయన ఎట్టకేలకి పూరీతో కలిసి ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టాడు. తాజాగా ఆయన లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిజానికి ఇస్మార్ట్ శంకర్ సినిమా ముందు వరకూ రామ్ క్లీన్ లుక్ లో క్లాసీగా కనిపించేవాడు. కానీ సినిమా కోసం పూరీ రామ్ ని మాస్ లుక్ లోకి మార్చేశాడు. కొన్నాళ్ళ పాటు రామ్ అలా ఉన్నాడని కూడా ఫ్యాన్స్ కూడా నమ్మలేదు అంతలా మారాడు. దానికే అంతలా షాకైన వారికి మరింత షాక్ ఇవ్వడానికా అన్నట్టు రామ్ లుక్ మళ్ళీ పూర్తిగా మార్చేశాడు.

ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదల సమయంలో ఫారిన్‌ ట్రిప్ కి చెక్కేసిన రామ్‌, కాస్త ఆలస్యంగా ప్రమోషన్స్ లో జాయిన్‌ అయ్యాడు. అన్ని ప్రమోషన్‌ ఈవెంట్స్ కి ఆఖరికి బిగబాస్‌ హౌస్ లోకి కూడా టోపి పెట్టుకొని వెళ్లి షాకిచ్చాడు. అయితే ఆయన టోపీ కింద ఏమీ లేదనే విషయాన్నీ తాజాగా సోషల్‌ మీడియాలో రివీల్‌ చేశాడు. గుండుతో ఉన్న రామ్‌ లుక్‌ చూసి అభిమానులు షాక్‌ అవుతున్నారు. సాధారణంగా మాస్ ఇమేజ్‌ ఉన్న హీరోలు కూడా ఇలాంటి ప్రయోగాలు వెంటవెంటనే చేయరు. మరి ఇప్పటి దాకా క్లాస్ ఇమేజ్ ఉండి, ఈ మధ్యనే మాస్ ఇమేజ్ కి షిఫ్ట్ అయిన రామ్‌ ఎందుకు గుండు చేయించుకున్నట్టు అనే చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ గుండు ఏదైనా సినిమా కోసమా అని చర్చ జరుగుతోంది. పూర్తి గుండుతో ఫ్రెంచ్ బియర్డ్ తో హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు రామ్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!