HomeTelugu Newsఏడు భాషల్లో రామ్ రెడ్

ఏడు భాషల్లో రామ్ రెడ్

Ram red movie

హీరో రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన రెడ్ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కానుంది. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీస్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మించారు. ఇప్పటికే ఈచిత్రానికి సంబంధించి విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని 7 భాషల్లో విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, భోజ్‌పురి భాషల్లోకి డబ్ చేశారు. రామ్ సరసన ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు మాళవిక శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu