HomeTelugu Trendingఅమెజాన్‌ ప్రైమ్‌లో 'పాగల్‌'

అమెజాన్‌ ప్రైమ్‌లో ‘పాగల్‌’

Paagal movie streaming on a

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్, నివేదా పేతురాజ్‌ జంటగా నటించిన చిత్రం ‘పాగల్’. నరేశ్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, బెక్కం వేణుగోపాల్‌ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదలైంది. ఈ సినిమా ఈ నెల 3 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ‘‘పాగల్‌’ కి వసూళ్లు బాగా వచ్చాయి. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించడం సంతోషంగా ఉంది. కరోనా ఫస్ట్‌వేవ్‌ తర్వాత థియేటర్స్‌లో సినిమాను చూడటానికి ప్రేక్షకులు బాగా వచ్చారు.

ఆ సమయంలో వచ్చి, హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సినిమాలకు మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ తర్వాత ఆడియన్స్‌ ఆశించిన స్థాయిలో థియేటర్స్‌కు రావడం లేదు. థర్డ్‌ వేవ్‌ వస్తుందని వినిపిస్తున్న వార్తలు కూడా ఓ కారణం కావొచ్చు. మిడిల్‌ క్లాస్‌ ఆడియన్స్‌ థియేటర్స్‌కు వచ్చినప్పుడే పెద్ద స్థాయి కలెక్షన్స్‌ చూడొచ్చు. ప్రస్తుతం శ్రీవిష్ణు హీరోగా ఓ సినిమా చేస్తున్నాం. డిసెంబరులో రిలీజ్‌ అనుకుంటున్నాం. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వల్ల మార్కెట్‌ పెరిగింది. నిజానికి అందరూ థియేటర్స్‌కు రారు. అలారానివారు ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారు. ఆ వ్యూయర్స్‌ అంతా ఎక్స్‌ట్రా ఆడియన్సే’’ అని అన్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu