HomeTelugu Trendingది వారియర్: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్‌ ఫిక్స్‌

ది వారియర్: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్‌ ఫిక్స్‌

Ram The warrior movie updat
టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్ – లింగుసామి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ది వారియర్’. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. తమిళంలో 28 మంది సెలబ్రిటీలను ఆహ్వానించి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల ఘనంగా నిర్వహించారు.

ఇక ఇప్పుడు తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ – జేఆర్సీ కన్వెన్షన్స్ లో ఈ వేడుకను జరపనున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. ఈ విషయాన్ని అధికారిక పోస్టర్ ద్వారా తెలియజేశారు. టాలీవుడ్ నుంచి ఈ వేడుకకు ఏయే సెలబ్రిటీలు హాజరవుతారనేది చూడాలి. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఆది పినిశెట్టి విలన్‌గా నటించగా, కీలకమైన పాత్రలో నదియా కనిపించనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu