HomeTelugu Trending'రామరాజు ఫర్ భీమ్' ముహూర్తం ఫిక్స్‌..

‘రామరాజు ఫర్ భీమ్’ ముహూర్తం ఫిక్స్‌..

 

Ramaraju for bheem on octob
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే ఈ సినిమా నుండి అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్‌) పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ.. ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ టీజర్ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఈ నెల 22న విడుదల చేయనున్న ఆ సినిమా యూనిట్ ఇప్పటికే ప్రకటన చేసింది.

ఈ టీజర్‌ను ఏయే భాషల్లో ఏయే యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా విడుదల చేస్తామన్న విషయాన్ని ఆ సినిమా యూనిట్ ఈ రోజు తెలిపింది. తెలుగులో డీవీవీ మూవీస్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేస్తామని చెప్పింది. తమిళంలో జూనియర్ ఎన్టీఆర్ అఫిషియల్ యూట్యూబ్ లో, హిందీలో అజయ్ దేవగణ్ యూట్యూబ్ లో, కన్నడలో వారాహి యూట్యూబ్ లో, మలయాళంలో అల్వేస్ రామ్ చరణ్ యూట్యూట్ ఛానెళ్లలో విడుదల చేస్తామని వివరించింది. దీని కోసం ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu