HomeTelugu Trendingహీరో నిఖిల్‌ను సత్కరించిన పోలీసు కమిషనర్‌

హీరో నిఖిల్‌ను సత్కరించిన పోలీసు కమిషనర్‌

Hero nikhil was felicitated
టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్ సత్కరించారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో ఎంతోమందికి సహాయం చేసిన నిఖిల్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా నిఖిల్‌కు పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం సజ్జనార్‌ నిఖిల్‌తో సరదాగా కాసేపు ముచ్చటించారు. కాగా కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, మందులు సహా అవసరమైన వారికి నిఖిల్‌ చేయూత అందించారు. నిఖిల్ ను సజ్జనార్ సత్కరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ప్రస్తుతం నిఖిల్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ’18 పేజెస్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్‌ సుకుమార్‌ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu