HomeTelugu Trendingపవన్‌ 'వకీల్ సాబ్' అయితే నేను 'డైరెక్టర్‌ సాబ్‌'

పవన్‌ ‘వకీల్ సాబ్’ అయితే నేను ‘డైరెక్టర్‌ సాబ్‌’

14
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం సమాజం లో జరిగే అంశాలపై స్పందిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎవరోఒకరి పై పంచ్ లు వేస్తూ తనదైన శైలిలో రియాక్ట్ అవుతు ఉంటాడు వర్మ. అయితే ఈరోజు పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేసారు చిత్ర బృందం. అయితే ఆ పోస్టర్ టైటిల్ పై వర్మ ఓ పంచ్ వేసాడు. పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఉన్న విధంగానే వర్మ కూడా కూర్చొన్నాడు. ఆ పోస్టర్ పై ‘డైరెక్టర్ సాబ్’ అని టైటిల్ వేసుకున్నాడు. ఆ పోస్టర్ ను చుసిన తరువాత పవర్ స్టార్ ఫాన్స్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకు వార్నింగ్ లు ఇస్తుంటే ఇంకొంత మంది మాత్రం నవ్వుకుంటున్నారు. వర్మ ఎవరిని వదలడు… దేనిని వదలడు అని ఇంకొంత మంది నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu