షూటింగ్‌లో హీరో నాగశౌర్యకు గాయాలు


యువ కథానాయకుడు నాగశౌర్య సినిమా చిత్రీకరణ సమయంలో గాయాలపాలయ్యాడు. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న సినిమా షూటింగ్ విశాఖలో జరుగుతోంది. షూటింగ్‌లో భాగంగా యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఓ సన్నివేశంలో నాగశౌర్య రోప్‌, డూప్‌ లేకుండా నటించారు. ఈ క్రమంలో ఆయన ఎడమకాలికి తీవ్రంగా గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం నాగశౌర్యను విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు 25 రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

CLICK HERE!! For the aha Latest Updates