HomeTelugu Trendingపోర్న్‌స్టార్‌గా రమ్యకృష్ణ.!

పోర్న్‌స్టార్‌గా రమ్యకృష్ణ.!

2 18సీనియర్‌ నటి రమ్యకృష్ణ శివగామి పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.. కాగా ఇప్పుడు రమ్య మరో సాహసం చేస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్‌ బిజీగా ఉన్న రమ్యకృష్ణ, ఓ తమిళ సినిమా కోసం పోర్న్‌స్టార్‌ పాత్రలో కనిపించనున్నారు. విజయ్‌ సేతుపతి, సమంత జంటగా త్యాగరాజన్‌ కుమారరాజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సూపర్‌ డీలక్స్‌. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు.

ఇదే సినిమాలో రమ్యకృష్ణ.. లీలా అనే శృంగార తారగా కనిపించనుంది. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలు వెల్లడించారు. ముందుగా ఈ పాత్రకు నదియాను సంప్రదించగా ఆమె తిరస్కరించడంతో రమ్యకృష్ణను తీసుకున్నామని తెలిపారు. ఈ సినిమాలో సమంత కూడా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu