HomeTelugu Trendingతమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా రమ్యకృష్ణ!

తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా రమ్యకృష్ణ!

ramya
త‌మిళంలో బిగ్ బాస్ సీజ‌న్- 5 స‌క్సెస్ ఫుల్‌గా జరుగుతుంది. కాగా ఈ కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేస్తున్న క‌మ‌ల్ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఇటీవల అమెరికా వెళ్లిన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ చెన్నై తిరిగి వచ్చాక కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో క్వారంటైన్‌లో ఉన్నారు.

ramya1

క‌మ‌ల్ హాసన్‌ కొన్నాళ్లు షోకి అందుబాటులో ఉండ‌ని.. ఆయ‌న స్థానంలో క‌మ‌ల్ కూతురు శృతి హాస‌న్ వ‌స్తుంద‌నే వార్తలు వినిపించాయి. అయితే తాజా స‌మాచారం సినియర్‌ నటి ర‌మ్య‌కృష్ణ పేరు తెరపైకి వ‌చ్చింది. తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 4ను ర‌మ్య‌కృష్ణ ఆల్‌రెడీ ఓసారి హోస్ట్ చేశారు. నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ నిమిత్తం హైద‌రాబాద్‌లో లేన‌ప్పుడు ర‌మ్య‌కృష్ణ‌నే స‌ద‌రు షోను న‌డిపించారు. అలాగే త‌మిళంలో ప‌లు షోల‌ను హోస్ట్ చేసిన అనుభ‌వం కూడా ర‌మ్య‌కృష్ణ‌కు ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమెతో షో చేయించాల‌ని అనుకుంటున్నార‌ట‌. క‌మ‌ల్ హాస‌న్ వ‌చ్చే వ‌ర‌కు రమ్య‌కృష్ణ‌తోనే షో ర‌న్ చేయాల‌ని నిర్వాహకులు భావించార‌ట‌. దానికి ర‌మ్య‌కృష్ణ కూడా ఓకే చెప్పిన‌ట్లు టాక్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu