HomeTelugu Trendingమోహన్‌లాల్ మూవీలో భారీ యాక్షన్ సీక్వెన్స్

మోహన్‌లాల్ మూవీలో భారీ యాక్షన్ సీక్వెన్స్

Mohan Lal movie Vrushabha

బహు భాషా నటుడిగా పేరొందిన ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్‌కు పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ ఉంది. ప్రస్తుతం మోహన్ లాల్ పాన్ ఇండియా మూవీ ‘వృషభ’లో నటిస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది.

ఈ మూవీలో మోహన్ లాల్‌తో పాటు శ్రీకాంత్ కొడుకు రోషన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నందకిశోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. రోషన్ సరసన షనయ కపూర్ నటిస్తోంది. శ్రీకాంత్, కన్నడ నటి రాగిణి ద్వివేది, ఒకప్పటి హిందీ నటి సల్మా కుమార్తె జహ్రా ఎస్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Mohanlal movie

‘వృషభ’ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. దీంతో భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. నెల రోజుల పాటు ఈ షెడ్యూల్‌ కొనసాగిందని, భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించినట్టు వెల్లడించారు.

దీనికి సంబంధించి షూటింగ్ లొకేషన్‌లో మోహన్ లాల్, రోషన్, శనయ కపూర్ తదితరులు కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. అత్యున్నత సాంకేతిక నిర్మాణ విలువలతో హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ త్వరగా పూర్తిచేసి వచ్చేఏడాది ఆరంభంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఏక్తా కపూర్, వరుణ్ మాథుర్, అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, శ్యామ్ సుందర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 4,500కు పైగా స్ర్కీన్స్‌పై విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత నిక్ థర్లో ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu