HomeTelugu Trendingమెగాస్టార్‌ సినిమాలో రమ్యకృష్ణ!

మెగాస్టార్‌ సినిమాలో రమ్యకృష్ణ!

Ramya krishna in chiranjeev
మెగాస్టార్‌ చిరంజీవి మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మలయాళం వెర్షన్లో మంజు వరియర్ పోషించిన కీలకమైన పాత్ర ఒకటి వుంది. ఈ పాత్ర కోసం ఇప్పటికే పలువురి పేర్లు వినిపించగా…తాజాగా రమ్యకృష్ణను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఎన్వీ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, గతంలో చిరంజీవితో ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘అల్లుడా మజాకా’, ‘ఇద్దరు మిత్రులు’ వంటి చిత్రాలలో రమ్యకృష్ణ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ పాత్ర రమ్యకృష్ణ అంగీకరిస్తుందో లేదో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu