HomeTelugu Big Stories'గుంటూరు కారం'లో రమ్యకృష్ణ

‘గుంటూరు కారం’లో రమ్యకృష్ణ

Ramya Krishna in Guntur Ka
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌
– మహేష్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది. మీనాక్షి చౌదరి మరియు శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మహేష్ బాబు 28వ సినిమాగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచీ ఏదో ఒక ఆటంకం ఎదరవుతూనే ఉంది. దీని వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ క్రమంలో.. ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ రమ్యకృష్ణ ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె ఖరారు చేశారు. రమ్యకృష్ణ తాజాగా ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ భార్యగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో ప్రమోషన్‌లో భాగంగా రమ్యకృష్ణ తమిళ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ.. తాను ‘గుంటూరు కారం’ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్టు చెప్పారు.

కాగా మహేష్‌- రమ్యకృష్ణ కాంబినేషన్‌లో ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా ఫుల్‌గా లేదు. 19 ఏళ్ల క్రితం వచ్చిన ‘నాని’ సినిమాలో మాత్రం ఒక పాటలో మహేష్‌తో రమ్యకృష్ణ ఆడిపాడారు. ఇప్పుడు 19 ఏళ్ల తరవాత మళ్లీ మహేష్ బాబు సినిమాలో నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో మహేష్ బాబు తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్నట్టు ఆ మధ్య రూమర్లు వచ్చాయి. కానీ, దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి లీక్ ఇవ్వలేదు.

కాగా, ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మహేష్ బాబు.. హైదరాబాద్‌కు తిరిగి రాగానే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు టాక్‌. మరోవైపు, రేపు మహేష్ బాబు పుట్టినరోజు. మరి ఈ సినిమా నుండి మహేష్‌ ఫ్యాన్స్‌కు ఎలాంటి ట్రీట్‌ ఉండబోతుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!