హీరోగా మారుతోన్న విలన్!

ఈ మధ్యకాలంలో హీరోలంతా విలన్స్ గా మారుతున్నారు. జగపతిబాబు, ఆది పినిశెట్టి ఇలా
చాలా మంది హీరోలు దానికి ఉదాహరణ. ఇప్పుడు ఓ విలన్ హీరోగా మారుతున్నాడు. జిల్
సినిమాతో టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన కబీర్ దుల్హన్ సింగ్ ఇప్పుడు హీరోగా మారుతున్నట్లు
సమాచారం. అది కూడా ఓ తెలుగు సినిమాలో.. దర్శకుడు అశ్విన్ ప్రస్తుతం తెలుగులో ఓ
లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా కబీర్ ను సెలెక్ట్ చేసినట్లు
తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం కబీర్ విలన్ గా కన్నడలో
హెబ్బులి, తెలుగులో ఏంజిల్ సినిమాల్లో నటిస్తున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates