HomeTelugu Big Storiesజయలలిత వెబ్ సిరీస్ ‘క్వీన్’ టీజర్ విడుదల..

జయలలిత వెబ్ సిరీస్ ‘క్వీన్’ టీజర్ విడుదల..

6 1
ఓ సినీ నటిగా, పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా… జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు. 2016లో అనారోగ్య కారణాలతో కన్నుమూసారు. ఆమె మరణం కూడా ఒక మిస్టరీయే. అందుకే దర్శక నిర్మాతలకు ఇప్పుడామె పెద్ద అసెట్ అవుతున్నారు. ఇప్పటికే కంగనా హీరోయిన్‌గా ‘తలైవి’ సినిమా చేస్తోంది. ఈ సినిమా టీజర్ విడుదల చేస్తే ఒక వైపు పొగడ్తలు మరోవైపు విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇక నిత్యామీనన్..జయలలితగా ‘ది ఐరన్ లేడీ’ అనే సినిమా తెరకెక్కతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తే మంచి స్పందన వచ్చింది. మరోవైపు విద్యాబాలన్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఒక బయోపిక్ తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇవి చాలవన్నట్టు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్.. అమ్మ జయలలిత జీవితంపై రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ఒక వెబ్ సిరీస్ ‌తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసారు.

ఇందులో స్కూల్ చదివే రోజుల్లో జయలలిత టాపర్. 18 ఏళ్లకే స్టార్ హీరోయిన్. చిన్నవయసులోనే ముఖ్యమంత్రి అయిన వనిత. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే ‘క్వీన్’ మీ కోసం ఎదురు చూస్తుంది అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ నెల 5న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తొలి సీజన్ 10 భాగాలుగా ప్రేక్షకుల ముందు రానుంది. దీనికి వచ్చే రెస్పాన్స్ ద్వారా .. రెండో సీజన్‌ను తెరకెక్కిస్తారట. ఈ వెబ్ సిరీస్‌ను ఒకేసారి తమిళంతో పాటు తెలుగు, హిందీలో తెరకెక్కించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను మురుగేశన్ అనే దర్శకుడితో కలిసి గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ వెబ్ సిరీస్ MX ప్లేయర్‌లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!