HomeTelugu Trending'లైగర్‌'లో విజయ్‌కు తల్లిగా రమ్యకృష్ణ

‘లైగర్‌’లో విజయ్‌కు తల్లిగా రమ్యకృష్ణ

Ramyakrishna as a Vijay Dev
డైనమిక్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న సంగతి తెలిసిందే. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘లైగర్‌’ కోసం బాక్సింగ్‌లో విజయ్‌ శిక్షణ తీసుకున్నారు. ఇందులో విజయ్‌దేవరకొండ పొడవాటి జుట్టుతో మాస్‌ లుక్‌లో విభిన్నంగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌ రౌడీ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ముంబైలో జరుగుతుంది. ఇక, ‘లైగర్‌’ విజయ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించనుంది. కొడుకు జాతీయ ఛాంపియన్‌ కావాలని కలలు కంటూ, తెలంగాణ యాసలో మాట్లాడే పాత్ర అని తెలుస్తోంది. తాజాగా రమ్యకృష్ణ, విజయ్ షూటింగ్ సెట్స్ లో కనిపించిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

View this post on Instagram

 

A post shared by Ramya Krishnan (@meramyakrishnan)

Recent Articles English

Gallery

Recent Articles Telugu