దర్శకుడు మణిరత్నంకు బాంబు బెదిరింపులు

లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ సినిమా ‘నవాబ్’‌. కాగా ఈ చిత్రం లో అభ్యంతరకర డైలాగ్‌లను తొలగించాలంటూ ఓ అగంతకుడు మణిరత్నం కార్యలయానికి ఫోన్‌ చేసిన బెదిరించాడు. చెన్నైలోని అభిరామపురంలోని మణిరత్నం ఆఫీస్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరించినట్టుగా ఆఫీసు సిబ్బంది వెల్లడించారు.

అయితే ఏ డైలాగ్‌లను తొలగించాలని అగంతగకుడు డిమాండ్ చేశాడో మాత్రం వెల్లడించలేదు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మణిరత్నం ఆఫీస్‌కు భద్రత కల్పించారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్‌27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తమిళ నాట 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, అరవింద్‌ స్వామి, సింబు, అరుణ్‌ విజయ్‌, విజయ్‌ సేతుపతి, జయసుధ, ఐశ్వర్యా రాజేశ్‌, అదితి రావు హైదరి ప్రధాన పాత్రలు పోషించారు.