HomeTelugu Trendingఫలక్‌నుమాలో రానా మిహీకాల పెళ్లి

ఫలక్‌నుమాలో రానా మిహీకాల పెళ్లి

5 18
దగ్గుబాటి ఇంట్లో త్వరలో పెళ్లి బజాలు మ్రోగనున్నాయి. రానా-మిహీకా బజాజ్‌లు ప్రేమించుకున్న సంగతి.. రానా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వీరి పెళ్ళికి ఇరు కుటుంబాలు కూడా ఒప్పకున్నాయి. ఈ క్రమంలో ఇటీవల రానా – మిహీకా రోకా వేడుక కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోకా వేడుకలో రానా – మిహిక బజాజ్ నిశ్చితార్థం మరియు వివాహం ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ 8న హైదరాబాద్ లో రానా – మిహీకల పెళ్లి జరగనుంది.

కాగా రానా-మిహీకాల పెళ్లి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో వైభవంగా నిర్వహించబోతున్నారట. మిహికా బజాజ్ ఇంటీరియర్ డిజైనర్ కావడంతో ఆమె వెడ్డింగ్ ప్లానర్ గా వ్యవహరించనున్నారట. ఇప్పటికే పెద్ద పెద్ద వివాహ వేడుకలకు నిర్వహించింది మిహిక. దీంతో వీరి వెడ్డింగ్ కి కూడా రాయల్ థీమ్‌తో సన్నాహాలను చేస్తోందట. తెలంగాణ ప్రభుత్వం సూచించిన గైడ్ లైన్స్‌ను అనుసరించి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. వివాహం జరిపించాలని కుటుంబసభ్యులు సన్నాహాలు చేస్తున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu