HomeTelugu Trendingకొత్త వ్యాపారం ప్లాన్‌ చేస్తున్న రకుల్‌

కొత్త వ్యాపారం ప్లాన్‌ చేస్తున్న రకుల్‌

11 15
సినిమాలతో పాటు అటు వ్యాపారాల్లో కూడా రాణిస్తున్నారు మన స్టార్స్‌ . చిన్న, పెద్ద హీరోలు అని లేకుండా ఎవరికీ వారు బిజినెస్ లతో బిజీ అయిపోతున్నారు. వీరి బాటలోనే కొంతమంది హీరోయిన్లు కూడా నడుస్తున్నారు. హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పాలసీ ఫాలో అవుతుంది. ఇప్పటికే F 45 పేరుతో జిమ్ మొదలుపెట్టి బిజినెస్ ఉమెన్‌గా మారిపోయింది ఈ అమ్మడు. ఈ బిజినెస్ లో అమ్మడుకు ఎదురేలేదనే చెప్పాలి. ఇక ఇప్పుడు అదే తరహాలో మంచి డిమాండ్ ఉన్న రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టాలని చూస్తోంది ఈ బ్యూటీ. గత ఏడాది నుంచి మంచి రెస్టారెంట్ లొకేషన్ కోసం సెర్చ్ చేసి ప్లానింగ్ రెడీ చేస్తున్న రకుల్ ప్రీత్ కొంతమంది పాట్నర్స్ ని కూడా కలుపుకుందట. రెండేళ్ల క్రితం ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్వరలో రెస్టారెంట్ బిజినెస్ లో ఎంటర్ కాబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆతర్వాత మళ్ళీ ఆ మాటెత్తలేదు . తాజాగా మళ్ళీ ఈ అమ్మడు రెస్టారెంట్ బిజినెస్ విషయంలో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. దేశంలోని మహా నగరాల్లో ఈ రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలనీ ప్లాన్‌ చేస్తుంది రకుల్ .

Recent Articles English

Gallery

Recent Articles Telugu