HomeTelugu Trending'రంగ రంగ వైభవంగా' సెన్సార్‌ పూర్తి

‘రంగ రంగ వైభవంగా’ సెన్సార్‌ పూర్తి

Ranga ranga vaibhavanga mov 1

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ సినిమా సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ ను దక్కించుకుంది. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది.

యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ కి కావలసిన అన్ని అంశాలు ఈ కథలో కుదిరాయనీ, ఈ సినిమాకి వచ్చిన ఏ ఒక్కరూ నిరాశతో తిరిగి వెళ్లరని వైష్ణవ్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అంటున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.

20220827fr630a1c045d130

Recent Articles English

Gallery

Recent Articles Telugu