HomeTelugu Trendingమహా సముద్రం నుండి రావు రమేష్ ఫస్ట్‌లుక్‌

మహా సముద్రం నుండి రావు రమేష్ ఫస్ట్‌లుక్‌

Rao Ramesh First Look from

టాలీవుడ్‌ విలక్షణ నటుడు రావు రమేష్ తాజాగా ‘మహా సముద్రం’ సినిమాలో నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ చిత్రం నుండి రావు రమేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో గూని బాబ్జీగా రావు రమేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. ఈ పోస్టర్ లో రావు రమేష్ లుక్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రావు రమేష్ మరోసారి ఒక ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నట్లు పోస్టర్‌ ద్వారా తెలుస్తోంది. అజయ్ భూపతి డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ లు హీరోయిన్‌లు నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mahasamudram First Look

Recent Articles English

Gallery

Recent Articles Telugu