HomeTelugu Trendingఆడిషన్స్‌ అని పిలిచి రేప్‌ చేయబోయాడు: బాలీవుడ్‌ బ్యూటీ

ఆడిషన్స్‌ అని పిలిచి రేప్‌ చేయబోయాడు: బాలీవుడ్‌ బ్యూటీ

1 3

ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చుసిన క్యాస్టింగ్ కౌచ్ పేరు వినిపిస్తుంది. మీటు ఉద్యమం మొదలైన దగ్గర నుంచి ఒకరి తర్వాత ఒకరు తమకు జరిగిన చేదు అనుభావాలను మీడియాతో పంచుకుంటున్నారు. తాజగా బాలీవుడ్ బ్యూటీ రష్మీ దేశాయ్‌ను ఆడిషన్ అని పిలిచి ఒక వ్యక్తి తనను రేప్ చేయబోయాడని మీడియాకు వెల్లడించింది. నటిగా కొన్ని సినిమాల్లో మెరిసి ఆ తర్వాత కనిపించకుండా పోయింది రష్మీ. ఆ తరువాత బిగ్‌బాస్ తో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చెప్పుకొచ్చింది. 16 ఏళ్ల వయసులో హీరోయిన్ అవ్వాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చిన తనను ఎంతో మంది మోసం చేసేందుకు ప్రయత్నించారు. కెరీర్ ఆరంభం నుండే నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాను. యశ్ రాజ్ పేరుతో సురజ్ అనే వ్యక్తి మోసం చేసేందుకు చూశాడు. యశ్ రాజ్ వద్ద నేను వర్క్ చేస్తున్నాను. ఆయన సినిమాల ఆడిషన్స్ కు పిలుస్తాను అంటూ నెంబర్ తీసుకున్నాడు. ఒక రోజు ఆడిషన్ అని పిలిచి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న అని చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్‌ భామ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu