HomeTelugu Trendingధనుశ్ జంటగా రాశి ఖన్నా!

ధనుశ్ జంటగా రాశి ఖన్నా!

Rashi khanna in dhanush mov
టాలీవుడ్‌లో రాశి ఖన్నా ప్రస్తుతం చైతూ చేస్తున్న’థ్యాంక్యూ’ , గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’లో హీరోయిన్‌గా నటిస్తుంది. హిందీ సినిమాల్లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తూ, వెబ్ సిరీస్ లలో దూకుడు చూపుతోంది. ఇక తమిళంలోనూ ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈమె నటించిన ‘అరణ్మణై 3’ .. ‘తుగ్లక్ దర్బార్’ విడుదలకి ముస్తాబవుతూ ఉండగా, కార్తీ జోడిగా ‘సర్దార్’ సినిమా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ధనుశ్ తదుపరి సినిమాలోనూ అవకాశాన్ని అందుకుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మిత్రన్ జవహర్ దర్శకత్వంలో ధనుశ్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం రాశి ఖన్నాను సంప్రదిస్తున్నారట. దాదాపు ఈ సినిమాలో ఈమె ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu