HomeTelugu Trendingచిరంజీవితో స్టెప్పులేయనున్న రష్మి!

చిరంజీవితో స్టెప్పులేయనున్న రష్మి!

Rashmi special song in bhol

యాంకర్‌ రష్మి తాజాగా బంపర్‌ ఆఫర్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న‘భోళాశంకర్‌’సినిమాలో రష్మి ఆడిపాడనున్నారట. సోదరి సెంటిమెంట్‌తోపాటు యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘భోళాశంకర్‌’ చిత్రానికి మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం ఎంతో వేడుకగా జరిగింది. ఇందులో రష్మి కూడా నటిస్తుందని అదేరోజు చిత్రబృందం అధికారికంగా ప్రకటించేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ‘భోళాశంకర్‌’లో మాస్‌ డ్యాన్స్‌ ఉంటే బాగుంటుందని.. అందులోనూ చిరు డ్యాన్స్‌ చేస్తే థియేటర్‌ దద్దరిల్లిపోతుందని చిత్రబృందం భావించిందట.

Rashmi1l

ఈమేరకు సంగీత దర్శకుడితో కలిసి ఓ మాస్‌ సాంగ్‌కి సన్నాహాలు చేస్తోందట. అంతా ఓకే అయితే.. ఆ పాటలో చిరుతో కలిసి రష్మి స్టెప్పులేయనున్నారని సమాచారం. శేఖర్‌ మాస్టర్‌ ఈపాటకు కొరియోగ్రఫీ చేయనున్నారని నెట్టింట్లో ప్రచారం సాగుతోంది. అదే కనుక నిజమైతే రష్మికి బంపర్‌ ఆఫర్‌ వరించినట్లే. తమిళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘వేదాళం’ రీమేక్‌గా ‘భోళాశంకర్‌’ తెరకెక్కుతోంది. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తిసురేశ్‌ నటించనున్నారు. అలాగే ఆయనకు జోడీగా తమన్నా సందడి చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu