HomeTelugu Trendingనన్ను ఇన్వాల్వ్‌ చేయకండి రాజు గారు: రాజమౌళి

నన్ను ఇన్వాల్వ్‌ చేయకండి రాజు గారు: రాజమౌళి

9 1‘నన్ను ఇన్వాల్వ్‌ చేయకండి రాజు గారు (రామ్‌గోపాల్‌ వర్మ).. ‘ అంటున్నారు దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి. వర్మ’కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే కొన్ని వర్గాల్లో వ్యతిరేకత నెలకొంది. తాజాగా ఇందులోని ఓ పాటను వర్మ విడుదల చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై తెరకెక్కించిన పాట అది. దీన్ని వర్మ శనివారం ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. కేఏ పాల్‌పై సినిమా తీస్తే ‘బాహుబలి 3’ కంటే పెద్ద హిట్‌ అవుతుందని అన్నారు. ఈ బయోపిక్‌ కోసం రాజమౌళి ఇప్పటికే వాషింగ్టన్‌ డీసీలో కేఏ పాల్‌తో చర్చలు జరిపారని తనకు తెలిసిందని చెప్పారు. కేఏ పాల్‌ తనకు ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పారని పేర్కొన్నారు.

దీనిపై దర్శకుడు రాజమౌళి ట్విటర్‌లో స్పందించారు. ‘నన్ను ఇన్వాల్వ్‌ చేయకండి రాజు గారు..’ అని పోస్ట్‌ చేశారు. దీనికి వర్మ రిప్లై ఇచ్చారు. ‘సర్‌.. నేను ఇన్వాల్వ్‌ చేయడం లేదు. ట్రంప్‌ టవర్‌లో మీతో కలిసి భోజనం చేసినట్లు కేఏ పాల్‌ నాకు చెప్పారు. ‘బాహుబలి 3′ కోసం మీరు ఆయనతో సంతకం చేయించుకున్నట్లు కూడా తెలిపారు’ అని అన్నారు. వీరి సరదా సంభాషణ నెటిజన్లను నవ్వించింది.

2017 ఏప్రిల్‌ 24న కూడా రాజమౌళిని ఉద్దేశిస్తూ వర్మ ఓ సరదా ట్వీట్‌ చేశారు. జక్కన్న పక్కన కూర్చుని ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ఆయన ‘బాహుబలి 2’ కంటే చాలా అందంగా ఉన్నారని అన్నారు. అప్పట్లో ఈ ట్వీట్‌కు రాజమౌళి బదులిచ్చారు. ‘అయ్యా.. నన్ను ఒగ్గేయండయ్యా..’ అని దండం పెడుతున్న ఎమోజీలు షేర్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu