HomeTelugu Big Storiesఅమితాబ్‌తో నటించనున్న రష్మిక

అమితాబ్‌తో నటించనున్న రష్మిక

Rashmika in Amitabh Bachcha
టాలీవుడ్‌లో రష్మిక మందన్నా అల్లు అర్జున్ పుష్పతో పాటు ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాలో నటిస్తోంది. ఇక అమ్మడు కోలీవుడ్ లో కార్తీతో ‘సుల్తాన్’ సినిమాలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. బాలీవుడ్ పై కూడా ఈ బ్యూటీ కన్నేసింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలసి ‘మిషన్ మంజు’ అనే సినిమాతో బాలీవుడ ఎంట్రీ ఇస్తోంది. ఇక రష్మిక నటించిన ‘టాప్ టక్కర్’ పాట నెల క్రితం విడుదలై 6.8 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఇదిలా ఉంటే హిందీలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ తో కలిసి ఓ సినిమా చేయనుంది. ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని షూటింగ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు ‘గుడ్ బాయ్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వినిపిస్తోంది. ఇందులో అమితాబ్, రష్మిక తండ్రి కూతుళ్ళుగా నటించబోతున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu