HomeTelugu Trendingరామ్‌చరణ్‌తో జతకట్టనున్న రష్మిక!

రామ్‌చరణ్‌తో జతకట్టనున్న రష్మిక!

rashmika with ramcharan2

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్-ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు మంచి క్రేజ్ వస్తోంది. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచే దీనిపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో కన్నడ నటుడు యశ్ నటిస్తున్నట్లు, అలాగే సంగీత దర్శకుడిగా అనిరుధ్‌కు అవకాశం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. లక్కీ గర్ల్‌గా పేరుతెచ్చుకున్న రష్మిక ఈ సినిమాలో నటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్‌రాజు రష్మిక పేరును సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం దక్షిణాదిలో బిజీగా వున్న రష్మిక బాలీవుడ్‌లోనూ నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu