HomeTelugu Trendingరష్మిక ప్రత్యేక పూజలు..వైరల్‌

రష్మిక ప్రత్యేక పూజలు..వైరల్‌

Rashmika is a special pujas
పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది రష్మిక మందన్నా. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ బ్యూటీ ఇటీవల ఇంట్లో పూజలు చేయించింది. అయితే ఈ పూజలకు కారణం ఏంటీ అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వివదాదాస్పద స్వామిగా పేరున్న వేణు స్వామితో రష్మిక మందన్న చేయించిన ప్రత్యేక పూజలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వేణుస్వామి.. సమంత నాగ చైతన్య విడాకులు అవుతాయని సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా రష్మిక ఇంట్లో వేణుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించింది. రష్మిక ఈ ప్రత్యేక పూజలు ఎందుకు నిర్వహించింది అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై రష్మిక ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై నెటిజన్లు పలు కామెంట్స్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu