HomeTelugu Trending'భీష్మ' కు బై చెప్పేసిన రష్మిక మందన

‘భీష్మ’ కు బై చెప్పేసిన రష్మిక మందన

5 3
నితిన్, రష్మిక మందన హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’ ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. కాగా ఇటివలే ఈ సినిమా నుండి మాస్ సాంగ్ ‘వాట్ యే బ్యూటీ’ వీడియో ప్రోమో విడుదల అయింది. ఈ సాంగ్‌లో నితిన్ స్టెప్స్.. రష్మిక గ్లామర్ హైలైట్‌గా నిలిచాయి. దీంతో ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాటల్నీ, విడుదలై టీజర్‌ను చూస్తుంటే ఈ సినిమాలో నితిన్ రష్మికల మధ్య కెమిస్ట్రీ కూడా ఓ రేంజ్‌లో ఉంటుందని అర్థమవుతోంది. దీంతో భీష్మపై నితిన్ చాలా నమ్మకంగా ఉన్నాడు.

భీష్మ సినిమా పూర్తిగా కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అందులో భాగంగా ఈ సినిమాలో వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ హైలెట్ అవుతుందని సమాచారం. భీష్మ ఫిబ్రవరి 21న విడుదల కానుంది. దీంతో రష్మిక మందన తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టింది. తాజాగా రష్మిక డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుంది. డబ్బింగ్ చాలా బాగా వచ్చిందట. దీంతో డబ్బింగ్‌ పూర్తి చేసి టీమ్‌కు బైబై చెప్పిందట రష్మిక మందన.మరోవైపు భీష్మ సినిమా అవుట్ ఫుట్ కూడా చాల బాగా వచ్చిందట. ఈ సినిమాలో కుమారి 21 ఎఫ్‌తో ఆకట్టుకున్న హెబ్బా పటేల్ కీలక పాత్రలో కనిపించనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu