చిరంజీవి-బాబి సినిమా టైటిల్‌ ఫిక్స్!‌


టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. పలు సినిమాలను లైన్‌లో పెట్టాడు. వీటిలో మలయాళ హిట్ చిత్రం ‘లూసిఫర్’ ఒకటి. దీనికి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. ‘ఆచార్య’ తర్వాత ఇదే ముందుగా సెట్స్ కి వెళుతుంది. ఇక ఆ తర్వాత ఆయన మరో రెండు సినిమాలు చేయాల్సి వుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘వేదాళం’ తమిళ చిత్రం రీమేక్ ఒకటి కాగా.. బాబీ దర్శకత్వంలో రూపొందే చిత్రం మరొకటి. అయితే, వీటిలో బాబీ సినిమానే ముందుగా సెట్స్ కి వెళుతుందని అంటున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతుందని తెలుస్తోంది. దీని కోసం హీరో పాత్రను బట్టి ఈ సినిమాకి ‘వీరయ్య’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి, ఇందులో వాస్తవం ఎంతన్నది త్వరలో వెల్లడవుతుంది.

CLICK HERE!! For the aha Latest Updates