HomeTelugu Trendingతమిళ స్టార్‌ హీరోతో జతకట్టనున్న రష్మిక!

తమిళ స్టార్‌ హీరోతో జతకట్టనున్న రష్మిక!

Rashmika opposite Tamil her
టాలీవుడ్‌ బ్యూటీ రష్మిక మందాన తెలుగులోనే కాక తమిళం, హిందీ సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటోంది. వరుస అవకాశాలు అందుకుంటూ అగ్ర హీరోయిన్‌గా వెలిగిపోతోంది. ప్రతి భాషలోనూ స్టార్‌ హీరోలతో కలిసి నటిస్తోంది. తాజాగా తమిళ స్టార్‌ హీరో విజయ్‌తో నటించాలని రష్మిక ఎప్పట్నుంచో అనుకుంటోంది. గతంలో ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఎట్టకేలకు తాజాగా ఆ ఛాన్స్ రష్మికను వరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మికను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. తమిళంతోపాటు తెలుగులోనూ రష్మికకు క్రేజ్ ఉండడంతో ఆమెనే హీరోయిన్‌గా తీసుకున్నారట. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రాబోతోందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu