HomeTelugu Trending'రాజా విక్రమార్క' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘రాజా విక్రమార్క’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Raja vikramarka movie relea
టాలీవుడ్‌ యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ సినిమా లో కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి డైరెక్షన్‌లో వస్తున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను డబుల్ ఎయిట్ రామరెడ్డి నిర్మిస్తున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మరో యువ నటుడు సుధాకర్ కోమాకుల ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆది రెడ్డి టి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా గ్రాండ్‌గా థియేట్రికల్‌గా రిలీజ్ కు సిద్ధమవుతోంది.

తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్‌ చేశారు. ఆ విషయాన్ని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. నవంబర్ 12న ‘రాజావిక్రమార్క’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu