HomeTelugu Trendingమేనేజర్​ కూమార్తెల హాఫ్‌ సారీ ఫంక్షన్‌లో రవితేజ

మేనేజర్​ కూమార్తెల హాఫ్‌ సారీ ఫంక్షన్‌లో రవితేజ

Ravi teja in his manager da

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన దగ్గర పనిచేసే వ్యక్తులతో ఎంతో ఉదారంగా ఉంటాడు రవితేజ. వారికి సంబంధించిన వేడుకలకు హాజరౌతూ ఇంట్లో మనిషిలా చూసుకుంటాడు.

రవితేజ వద్ద శ్రీనివాస రాజు మేనేజర్​గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస రాజుకు అనన్య, నిత్య ఇద్దరు కుమార్తెలు. వారికి హాఫ్​ సారీ ఫంక్షన్​ను ఆదివారం (ఫిబ్రవరి 27) రోజున ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాస్​ మహారాజా రవితేజ హాజరై సందడి చేశారు. అనంతరం అనన్య, నిత్యలను ఆశీర్వదించాడు. అలాగే ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్​ రావిపూడి, పూరి జగన్నాథ్​ తమ్ముడు సాయిరామ్​ శంకర్​, యువ నటుడు తేజ , నటుడు బ్రహ్మాజీ ఫైట్​మాస్టర్స్​ రామ్​ లక్ష్మణ్​ తదితరులు హాజరయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu