HomeTelugu Trendingడీజే టిల్లు సీక్వెల్‌పై నిర్మాత ట్వీట్

డీజే టిల్లు సీక్వెల్‌పై నిర్మాత ట్వీట్

DJ Tillu Sequel
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన డీజే టిల్లు మంచి విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తనదైన డైలాగ్ డెలివరీతో, యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు సిద్దు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌కు ముహూర్తం ఖరారైంది. నిర్మాత నాగవంశీ డీజే టిల్లు సీక్వెల్‌ను చెప్పకనే చెప్పారు. దేవుడి ఫొటోల ముందు స్క్రిప్ట్ పుస్తకాన్ని ఉంచి పూజలు చేసిన ఫొటోను షేర్ చేశారు నాగవంశీ. మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీ రౌండ్-2 పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రేజీ అడ్వెంచర్ షూటింగ్ ఆగస్ట్‌ నుంచి మొదలవుతుందంటూ ట్వీట్ చేశారు.

ఫిబ్రవరిలో విడుదదైన డీజే టిల్లు చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. విమల్‌తో కలిసి సిద్దు కూడా స్క్రిప్ట్ వర్క్‌లో పాల్గొన్నాడు. టిల్లు పాత్రకోసం తన ఆహార్యాన్ని, నటనను మార్చుకున్నాడు సిద్దు. అది యువతలో ట్రెండ్ అయ్యేలా చేసింది. బాక్సాఫీస్ వద్ద డీజే టిల్లు మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు దీని సీక్వెల్ కూడా మంచి విజయం సాధించాలని నిర్మాత మధుర శ్రీధర్ శుభాభినందనలు సోదరా అంటూ.. పార్ట్-2 బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలి అంటూ సిద్దు జొన్నలగడ్డ ట్విట్టర్‌ను ట్యాగ్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu