HomeTelugu Trendingకొత్త సినిమా ప్రారంభించిన రవితేజ

కొత్త సినిమా ప్రారంభించిన రవితేజ

Ravi teja new movie launche

మాస్‌ మహాతేజ రవితేజ వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. అలా రవితేజ మరో కొత్త దర్శకుడు శరత్ మండవతో సినిమా ప్రారంభించారు. రచయితగా మంచి అనుభవమున్న శరత్ కి దర్శకుడిగా ఇది తొలి సినిమా. ‘ఉగాది’ పండుగను పురస్కరించుకుని, ఈ సినిమా కొంతసేపటి క్రితమే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కరోనా తీవ్రత కారణంగా చాలా సింపుల్ గా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

దేవుడి చిత్రపటాలపై రవితేజ క్లాప్ ఇవ్వగా, ఈ సినిమా షూటింగును లాంఛనంగా ప్రారంభించారు. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాకి, సత్య సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు. ‘దివ్యాన్ష కౌశిక్’ ఈ సినిమాలో హీరోయిన్‌గా అలరించనుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ నెలలోనే మొదలుకానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu