HomeTelugu Trendingజూలై 1 నుంచి రంగంలోకి దిగనున్న రవితేజ

జూలై 1 నుంచి రంగంలోకి దిగనున్న రవితేజ

Ravi Teja new movie shoot b
టాలీవుడ్‌ హీరో రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రమేశ్‌ వర్మ డైరెక్షన్‌లో ‘ఖిలాడి’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే కొంతభాగం షూటింగ్‌ జరుపుకొంది. దీంతోపాటు శరత్‌ మండవ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటన ఆధారంగా థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం జులై 1 నుంచి రంగంలోకి దిగనున్నాడు రవితేజ. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ప్రధాన తారాగణమంతా చిత్రీకరణలో పాల్గొననున్నారు. దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్యామ్‌ సి.ఎస్‌. సంగీతం అందిస్తున్నారు.ఈ మూవీ టైటిల్‌ త్వరలోనే ప్రకటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu