HomeTelugu Trendingబేబీపై రవితేజ ప్రశంసలు

బేబీపై రవితేజ ప్రశంసలు

ravi teja praise on baby mo

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన చిత్రం బేబీ. సాయి రాజేష్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా గత శుక్రవారం థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నాగబాబు, లిరిషా, కుసుమ, సాత్విక్ ఆనంద్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక బేబీ మూవీ పై ప్రేక్షకులు, విమర్శకుల నుండి మాత్రమే కాదు పలువురు సినీ ప్రముఖుల నుండి కూడా ప్రసంశలు కురుస్తున్నాయి.

తాజాగా ఈ మూవీ చూసిన మాస్ మహారాజా రవితేజ తన ట్విట్టర్‌లో మూవీ పై పొగడ్తలు కురిపించారు. ఈరోజుబేబీ మూవీని చూడటం జరిగింది, ఎంతో బాగా నచ్చింది. సాయి రాజేష్ అద్భుతంగా రూపొందించారు మరియు సాంకేతిక బృందం గొప్పగా పని చేసారు. ముఖ్యంగా విజయ్ బుల్గానిన్ సంగీతం చాలా బాగుంది. ఇక నటీనటులైన.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ అందమైన కథని నిర్మించిన ఎస్ కె ఎన్ మరియు మాస్ మూవీ మేకర్స్‌కు అభినందనలు అంటూ రవితేజ పెట్టిన ట్విట్టర్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu