HomeTelugu Trending'ఖిలాడి' థియేటర్స్‌లోనే: మూవీ యూనిట్‌

‘ఖిలాడి’ థియేటర్స్‌లోనే: మూవీ యూనిట్‌

Raviteja khiladi release
టాలీవుడ్‌ మాస్‌ మహరాజా రవితేజ నటించిన తాజా చిత్రం ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో హవీష్ ప్రొడక్షన్స్ , పెన్ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా .. యాక్షన్ కింగ్ అర్జున్‌తో పాటు హాట్‌ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు .షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28 న రిలీజ్‌ చేసేందుకు రెడీ చేశారు. అయితే కరోనా సెకెండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ‘ ఖిలాడి ‘ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కానుందనే న్యూస్ సినీ వర్గాల్లో వినిపిస్తుండగా, ఈ విషయంపై మూవీ మేకర్స్ స్పందించారు.

రవితేజ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం పూర్తిగా అవాస్తమని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో చూసి ఆస్వాదించేలా రూపొందిస్తున్నామని నిర్మాత కోనేరు సత్యనారాయణ వెల్లడించారు. ఇటలీలో తీసిన యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తాయని పేర్కొన్నారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి , డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు .

Recent Articles English

Gallery

Recent Articles Telugu