HomeTelugu Trending'ఈగల్‌' కోసం లండన్‌కు రవితేజ!

‘ఈగల్‌’ కోసం లండన్‌కు రవితేజ!

Ravi Teja off for Eagle shoot in London
మాస్‌ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉంటాడు. ప్రస్తుతం ఆయన టైగర్‌ నాగేశ్వరరావు అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో పాటు ఆయన హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఈగల్‌’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ కోసం రవితేజ లండన్ వెళ్లారు.

ఇప్పటికే చాలా వరకూ షూటింగ్‌ పూరైంది. అక్కడ చివరి షెడ్యూల్ ను చిత్రీకరించనున్నారు. ‘ఈగల్’ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇక, వచ్చే నెల నుంచి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా చిత్రీకరణకు రవితేజ హాజరుకానున్నారని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu