HomeTelugu Trendingవిశాల్‌ కొత్త అప్డేట్‌: హైదరాబాద్‌లో లాంగ్‌ షెడ్యూల్‌

విశాల్‌ కొత్త అప్డేట్‌: హైదరాబాద్‌లో లాంగ్‌ షెడ్యూల్‌

Vishal new movie started in

కోలీవుడ్‌ హీరో విశాల్ తాజాగా ‘నాట్ ఏ కామన్ మ్యాన్'(వర్కింగ్ టైటిల్) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. విశాల్ 31వ సినిమాగా ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ తెరకెక్కుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించాడు. విశాల్ సొంతంగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమా నిర్మిస్తుండగా టిపి శరవణన్ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ సంబంధించి అప్డేట్ ప్రకటించాడు విశాల్. తాజాగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. కరోనా ప్రోటోకాల్ పాటిస్తూనే సినిమా షూటింగ్ జరుపుతున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే హైదరాబాద్ లోనే షూటింగ్ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. జులై చివరి లోగా పూర్తి షూటింగ్ కంప్లీట్ అవుతుందని విశాల్ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu