HomeTelugu Trendingరవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ అప్డేట్

రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ అప్డేట్

Raviteja Tiger Nag

రవితేజ హీరోగా రాబోతున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓ గజదొంగ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

టైగర్ నాగేశ్వరరావు సినిమాకు యంగ్ డైరెక్టర్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లు. 1970 కాలంలో స్టువర్టుపురంలో గజదొంగగా పేరు గాంచిన నాగేశ్వర రావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

పాన్ ఇండియా రేంజ్‍లో రూపొందిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. రవితేజ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Tiger Nag2

ఆగస్టు 17న టైగర్ దండయాత్ర అంటూ మేకర్స్ ఇటీవలే ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ దండయాత్ర ఏమిటి అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఆగస్టు17న టీజర్‌ను రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఆగస్టు 17న టైగర్ దండయాత్ర’ అని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఆగస్టు 12న ట్వీట్ చేసింది.

ఈ చిత్రంలో రేణు దేశాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆమె తెలుగు సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రలో కనిపంచనున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్నిఅభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 20వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu