HomeTelugu Trending'RC 15' లో ఎస్‌.జె సూర్య.. వెల్కమ్‌ చెప్పిన రామ్‌ చరణ్‌

‘RC 15’ లో ఎస్‌.జె సూర్య.. వెల్కమ్‌ చెప్పిన రామ్‌ చరణ్‌

RC15 Movie Update
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ఓ భారీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సంస్థలో 50వ ప్రాజెక్ట్ గా ఉన్నత స్థాయిలో నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ గతంలోనే మొదలై కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా టాక్‌. ఇదిలా వుంటే ఈ మూవీలోని పవర్ ఫుల్ విలన్ గా తమిళ దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య నటిస్తున్నారంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఈ రోజు (శుక్రవారం) ఈ మూవీలో ఎస్.జె. సూర్య నటిస్తున్న విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది.

హీరో రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ఎస్.జె. సూర్య ఫొటోని షేర్ చేస్తూ ‘వెర్సటైల్ యాక్టర్ మా స్టెల్లర్ కాస్ట్ లో జాయిన్ అయ్యారు. వెల్కమ్ ఆన్ బోర్డ్ సర్’ అంటూ ఎస్.జె. సూర్య కు ఈ ప్రాజెక్ట్ లోకి స్వాగతం చెబుతూనే ఆయన మా సినిమాలో నటిస్తున్నారని వెళ్లడించారు. ఎస్.జె. సూర్య ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu