అఖిల్ బ్రేకప్ కు కారణం ఆ అమ్మాయేనా..?

అక్కినేని అఖిల్ తనయుడు అక్కినేని అఖిల్, జీవీకే మనవరాలు శ్రేయాభూపాల్ ను ప్రేమించడం వారిద్దరికి నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా వీరి పెళ్లి బ్రేక్ అయిందంటూ కొన్నివార్తలు బయటకి వచ్చాయి. దానికి కారణం అఖిల్ అనీ, సుబ్బిరామిరెడ్డి ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలో శ్రియాకు, అఖిల్ కు మధ్య గొడవైందనీ, అలానే ఎయిర్ పోర్ట్ లో ఓ విషయమై గొడవ పడ్డారని రకరకాలుగా చెప్పుకుంటున్నారు.

తాజాగా వీరిద్దరి బ్రేకప్ కు కారణం ఓ అమ్మయని టాక్. అఖిల్ ఓ క్రీడాకారిణితో సన్నిహితంగా మెలగడం శ్రేయా కంట పడిందట. ఇద్దరు కలిసి పార్టీలు, పబ్బులు అని తిరగడం శ్రేయాకు నచ్చకపోవడంతో ఈ విషయమై అఖిల్ ను నిలదీసినట్లు తెలుస్తోంది. కానీ అఖిల్ మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉండడంతో ఇక శ్రేయా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని నిర్ణయించుకుందట. మరి ఈ విషయంపై ఇంకెన్ని గాసిప్స్ వినిపిస్తాయో..
చూడాలి!